పన్ను ఎగ్గొట్టినవారి పేర్లిస్తే.. 50వేల బహుమతి

హైదరాబాద్ : పన్ను ఎగవేతదారుల సమాచారం ఇస్తే రూ.50 వేల ప్రోత్సాహక బహుమతి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు తెలంగాణ వాణిజ్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. సినిమా థియేటర్లలో  టికెట్ల అమ్మకాలపై పన్ను రావాలని.. కానీ దీనిపై సమగ్ర సమాచారం రావడం లేదన్నారు. ఇకనుంచి టికెట్ల అమ్మకాలపై పూర్తి సమాచాంర సేకరించి పన్ను వసూలు చేస్తామని ఆయన తెలిపారు. పెండింగ్ కేసులను మానటరింగ్ చేయడానికి చర్చిస్తున్నామని చెప్పారు. వాణిజ్య శాఖకు తక్కువ ఆదాయం రావడానికి పెట్రోల్ , డీజిల్ ధరలే కారణమన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *