Breaking News

పనామా కలకలం.. ప్రముఖుల గుండె దడ..

Collage-3

పనామా పేపర్స్ లీకేజీలతో ప్రపంచవ్యాప్తంగా కలకలం మొదలైంది.. పనామాలో బ్లాక్ మనీ దాచుకొని పెట్టుబడులు పెట్టి కంపెనీలు అక్రమంగా పెట్టిన వారి గుట్టు పత్రాల లీకేజీతో రట్టు అయ్యింది.. హ్యాకింగ్ వల్లే ఈ పత్రాలు లీకయ్యాయని రహస్య ఖాతాలు నిర్వహిస్తున్న ఫోన్సెకా సంస్థ తెలిపింది. అనేక దేశాల అధ్యక్షులు, ప్రధానులు , సినీ ప్రముఖులు ఈ నల్లదందాలో ఉన్నారు.. చైనా నేతల పేర్లు బయటకొచ్చినా అక్కడి ప్రభుత్వం గుట్టుగా వ్యవహరిస్తూ ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఐస్ లాండ్ అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధాని కామెరన్ సహా చాలా మంది నల్లడబ్బు దాచినవారిలో ఉన్నారు..

కాగా పనామా కలకలంలో తొలివికెట్ పడింది. ఐస్ లాండ్ ప్రధాని రాజీనామా చేశారు.. లీకేజీ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరపనున్నట్టు పనామా ప్రభుత్వం ప్రకటించింది.. కాగా దేశంలో నల్లడబ్బు దాచిన వారిలో అమితాబ్ , హీరోయిన్ ఐశ్వర్య రాయ్, కొందరు దేశీయ దిగ్గజ వ్యాపారులు ఉన్నట్టు తేలడంతో కలకలం మొదలైంది.కాగా దీనిపై అమితాబ్ స్పందించారు. తాను ఈ కుంభకోణం లో లేనని తనను అనవసరంగా ఇరికించారని ఆరోపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *