పద్మ పురస్కారాల ప్రదానం

Ramoji-Rao-Rajinikanth-and-Rajamouli-Padma-Awards

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అంగరంగ వైభవంగా పద్మ అవార్డుల పురస్కార ప్రదానోత్సవం జరిగింది.. ప్రముఖ వ్యక్తులు ఈ అవార్డులను అందుకున్నారు. తెలుగు ప్రాంతాల నుంచి రామౌజీ, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామౌజీరావు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషన్ ను అందుకున్నారు. ఇక వీరితో పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, సామాజిక ఉద్యమ కారిణి సునీత కృష్ణన్, సాహితీ వేత్త యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ , దర్శక ధీరుడు రాజమౌళికి పద్మ శ్రీ పురస్కారం దక్కింది..

అనంతరం రామౌజీరావును కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజులను వారి నివాసంలో సన్మానించారు. వారితో కలిసి విందును ఆరగించారు. ఈ సందర్భంగా రామౌజీ రావు మాట్లాడుతూ దేశంలోనే ఓ ప్రతికాధిపతికి దేశ అత్యున్నత పురస్కారం అందించడం కేంద్ర ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛకు అందించిన గొప్ప గౌరవమన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *