పద్మశ్రీ చింతకింది మల్లేశంకు కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన కేటీఆర్

 

చేనేత రంగానికి గణనీయమైన సేవలు అందిస్తున్న పద్మశ్రీ చింతకింది మల్లేశంకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని చేనేత, ఔళి శాఖ మంత్రి కె టి రామారావు అందించారు. ప్రభుత్వం అందించిన ఈ కోటి రూపాయల గ్రాంట్ తో చింతకింది మల్లేశం తన లక్ష్మి అసు మిషిన్ల ఉత్పత్తిని పెంచేందుకు,  చేనేత రంగానికి అవసరం అయిన ఇతర ఆవిష్కరణలు చేసేందుకు వినియోగించుకోనున్నారు.  ప్రస్తుతం ఆలేరు లోని తన సొంత ఇంటి నుంచి ఆసు మెషిన్లను మల్లేశం తయారుచేస్తున్నారు. సుమారు 650 మేషిన్లకు డిమాండ్ ఉన్నదని, ఈ ఆర్థిక సహాయం ద్వారా మెషీన్లను తయారు  చేసేందుకు కోసం వీలు కలుగుతుంది. వీటిని మెదట పోచంపల్లిలో పాత పద్దతుల్లో చేనేత పనులు నిర్వహిస్తున్న కార్మికులకు సరఫరా చేసేందుకు వీలుకలుగుతుంది. దీంతోపాటు తెలంగాణలోని చేనేత కార్మికులకు ఉపయోగపడే ఈ మేషిన్లకు భవిష్యత్తులో మరింత డిమాండ్ వస్తుందని, ఈ డిమాండ్కు అనుగుణంగా తన ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన ఇంజనీరింగ్ మరియు ఇతర సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం నుంచి చింతకింది మల్లేశం ఆర్థిక సహాయం కోసం గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మల్లేశం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం టెక్స్టైల్ శాఖ తరఫున కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినది. ఈ మేరకు మంత్రి కేటీ రామారావు ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో ఆర్థిక సహకారానికి సంబంధించిన పరిపాలన ఉత్తర్వులను మంత్రి మల్లేశంకు అందించారు.

ఒక ఎకరం భూమిలో షెడ్డు తోపాటు, కార్యాలయము, రవాణా వాహనం, మెషినరీ, వర్కింగ్ క్యాపిటల్ వంటి వాటి కోసం ఈ కోటి రూపాయలను వినియోగించనున్నట్లు చింతకింది మల్లేశం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమకు సాధ్యమైనంత ఎక్కువగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నదని, ఇప్పటికే టెక్స్టైల్ శాఖకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేశామని మంత్రి అన్నారు. రూరల్ ఇన్నోవేషన్ రంగానికి ప్రభుత్వం చేయూతనిస్తుందని, అందులో భాగంగానే గ్రామీణ స్థాయి నుంచి అద్బుతమైన అవిష్కరణ చేసిన చింతకింది మల్లేశం సేవలను ప్రత్యేకంగా గుర్తించి ఈ ఆర్థిక సాయం అందించామని మంత్రి తెలిపారు. మల్లేషంకు మరింత సహాకారం అందిస్తామన్నారు.  

 

తన విజ్ఞప్తి మేరకు ఆర్థిక సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కె తారక రామారావుకు మల్లేషం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *