పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల

kadiyam

హైదరాబాద్ : తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మార్చి లో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో 77.05 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు పై చేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు 79.24 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 76.11 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

మొత్తం ఫలితాల్లో వరంగల్ జిల్లా 96.01 శాతం ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలవగా.. ఆదిలాబాద్ 54.06 శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది. కాగా టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు మే 30వ తేదీలోగా రుసుము చెల్లించాలని అధికారులు ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *