Breaking News

పదవుల పండుగకు వేళయ్యింది..

KCR(39)

– వేములవాడ ఎవరికొచ్చేనో..
నామినేటెడ్ పోస్టులకు వేళయ్యింది. సీఎం కేసీఆర్ భర్తీ చేస్తానని మాట ఇవ్వడంతో అందరి దృష్టి ఇప్పుడు దానిమీద పడింది.. ముఖ్యంగా తెలంగాణలోనే పెద్ద దేవస్థానమైన వేములవాడ ఆలయ చైర్మన్ పదవి ఎవరికి దక్కేనో అన్న చర్చ మొదలైంది. తెలంగాణలో అత్యధిక ఆదాయం కలిగి ఉంది వేములవాడ ఆలయమే.. దీంతో ఈ ఆలయ చైర్మన్ పదవికి అందరూ ఆశిస్తున్నారు..ఇవేకాదు నామినెటెడ్ పోస్టులైన మార్కెటింగ్, దేవాదాయ, ఆర్టీసీ, ఇతర చైర్మన్ల పోస్టులను తెలంగాణ ప్రభుత్వం నియమించేందుకు సిద్దమైంది.

కాగా చాలా మార్కెట్, దేవాలయ కమిటీలకు ఇంకా గత కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన వారే చైర్మన్లుగా కొనసాగుతున్నారు. వేములవాడకు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు చైర్మన్ గా ఉన్నారు.. దీంతో టీఆర్ఎస్ నాయకులు ఎంతో ఆశగా ఈ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తానని ప్రకటించడంతో పాటు నామినేటెడ్ పదవులు ఎన్ని ఉన్నాయో మంత్రులు లెక్కలు తీయాలని.. అలాగే, ఎమ్మెల్యేలందరూ నామినేటెడ్ పదవుల కోసం జాబితాలను తయారు చేయాలని ఆదేశించారు. దీంతో తెలంగాణలో త్వరలోనే పదవుల పండుగ నెరవేరడానికి రంగం సిద్ధం అయినట్టే కనిపిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *