పదవీ విరమణ పొందిన పోలీసులను సన్మానించిన ఎస్పీ

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పోలీసు శాఖలోని పదవీ విరమణ పొందిన పోలీసులను బుధవారం నాడు జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ సన్మానించారు. పదవీ విరమణ పొందిన పోలీసుల కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పదవీ విరమణ పొందిన పోలీసులకు పెన్షన్ పత్రాలతో పాటు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ, భద్రత, ఎపిజిఎల్ ఐసీ జమ అయిన మొత్తాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బి.జనార్దన్ రెడ్డి, ఆర్ ఐ గంగాధర్, పోలీసు అధికారుల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సీహెచ్ సాగర్,సభ్యులు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *