పదవి విరమణ పొందిన పోలీసులను సన్మానించిన ఎస్.పి

పదవి విరమణ పొందిన పోలీసులను సన్మానించిన ఎస్.పి

జిల్లా పోలీస్ శాఖలో పదవి విరమణ పొందిన పోలీసులను మంగళవారం నాడు జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ సన్మానించారు. పదవి విరమణ పొందిన పోలీసుల కుటుంబసభ్యులందరినీ ఆహ్వనించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవి విరమణ పొందిన పోలీసులు ఎ.ఆర్.ఎస్.ఐలు పి. విక్రమ్ సింహరావు, ఎం.ఏ వహీద్, పి. ప్రతాప్ రెడ్డి, యం.డి సుభాన్ ఖాన్, ఎ. ఎస్. ఐలు యం.డి.గౌస్ మొహినొద్దీన్ (ఎస్.ఎల్.ఏ), ఎల్. బాలయ్య (త్రీటౌన్ కరీంనగర్), యం.డి శౌకత్ (సి.సి.ఎస్,కరీంనగర్), సీనియర్ అసిస్టెంట్ యం ఏ జబ్బార్ (డిపివో)లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. పదవి విరమణ పొందిన పోలీసులకు పెన్షన్ పత్రాలతో పాటు, క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటి, భద్రత, ఎ.పి.జి.ఎల్.ఐ.సి జమ అయిన మొత్తాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓ.ఎస్.డి ఎల్. సుబ్బరాయుడు, ఎ.ఆర్.డి.ఎస్పీ కోటేశ్వరరావు. ఆర్.ఐలు గంగాధర్, శశిధర్, పోలీసు అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు యం.సురేందర్, రాష్ట్ర్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రవికాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, సభ్యులు వెంకట్రాజం, మల్లయ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *