పదవి విరమణ పొందిన పోలీసులకు సన్మానం

జిల్లా పోలీస్ శాఖలో పదవి విరమణ పొందిన పోలీసులను గురువారం నాడు జిల్లా అడిషనల్ ఎస్.పి. టి.అన్నపూర్ణ సన్మానించారు. పదవి విరమణ పొందిన పోలీసుల కుటుంబ సభ్యులందరినీ ఆహ్వనించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవి విరమణ పొందిన పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.ఐలు వి.లక్ష్మయ్య(వేములవాడ), మహ్మద్ నజీముద్దీన్(కరీంనగర్ త్రీటౌన్), మేడి ప్రేమ్ రాజు(సి పి ఎస్ కరీంనగర్), ఎ.ఎస్.ఐ మహ్మద్, అసనొద్దీన్(జగిత్యాల ట్రాఫిక్), హెడ్ కానిస్టేబుళ్ళు యం.డి అబ్దుల్ ఆఫీఖ్, యం.డి అఫ్జలుద్దీన్, ఖాజాజహీరొద్దీన్(ఎఆర్, కరీంనగర్)లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్.పి డి.జోయల్ డేవిస్ మాట్లాడుతూ పదవి విరమణ అనంతరం వచ్చే డబ్బులను శాశ్వత అవసరాల కోసం మాత్రమే వినియోగించాలన్నారు. అత్యాశకుపోయి ప్త్ర్రెవేటుగా పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని పేర్కొన్నారు. పదవి విరమణ పొందిన పోలీసులకు పెన్షన్ పత్రాలతోపాటు, క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటి, భద్రత, ఎ.పి.జి.ఎల్.ఐ.సిలో జమ అయిన మొత్తాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు యం.సురేందర్, ఉపాధ్యక్షులు సి.హెచ్.సాగర్, రాష్ట్ర్ర కార్యవర్గ సభ్యులు ఎస్.రవికాంత్, అసోసియేషన్ ప్రతినిధులు రవి, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *