
బీసీసీఐ అధ్యక్షపదవిలో ఉండగానే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు జగన్ మోహన్ దాల్మియా తుది శ్వాస విడిచాడు.. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దాల్మియా బిర్లా అస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.. ఆదివారం పరిస్థితి విషమించి ఆయన మరణించారు.
దాల్మియా కోల్ కతా క్రికెట్ అద్యక్ష పదవి నుంచి బీసీసీఐ ప్రెసిడెంట్ గా,, ఐసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. భారత క్రికెట్ రూపురేఖలు మార్చి ప్రపంచంలోనే డబ్బున్న క్రికెట్ సంస్థగా తయారు చేసిన ఘనత దాల్మియా.. అంతటి సంస్కరణల వాది చివరకు బీసీసీఐ అధ్యక్షుడిగానే కొనసాగుతూ చనిపోయారు. ఆయన మృతికి భారత ఆటగాళ్లు, వరల్డ్ క్రికెట్ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు.