పత్రికలు, వార్తలు ఒకటే.. జీతాలే వేరు..

salory

పత్రికలు.. వార్తలు ఒక్కటే.. కానీ జీతాలే వేరు.. సంస్థలకు యాడ్స్ ఇచ్చే
సంస్థలు అవే.. కానీ భత్యం చెల్లింపుల్లో మాత్రం కొసరు.. పత్రికలు
మారుతున్నా జర్నలిస్టుల జీవితాల్లో మార్పు రావడం లేదు. పత్రిక రంగంలో
ఇప్పుడు సంక్షోభం నెలకొంది. ఇందుకు ముగిసిన సార్వత్రిక ఎన్నికలు.. సాక్షి ఎడిషన్ల ఎత్తివేత ఈ రెండు ఇప్పుడు తెలంగాణ పత్రికరంగంలో జీతాల పెంపును వాయిదా వేస్తున్నాయి. పెంచినా 300 నుంచి 500 ఇంక్రిమెంటు పడుతుందంటే పరిస్తితి అర్థం చేసుకోవచ్చు..

జర్నలిస్టులకు డిమాండ్ ఉంటేనే మార్కెట్ లో జీతాలు పెరుగుతాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.. సాక్షి జిల్లాల్లోని ఎడిషన్లు ఎత్తి వేయడంతో చాలా మంది సబ్ ఎడిటర్లు సొంత కారణాలతో వరంగల్, హైదరాబాద్ వెళ్లలేక రాజీనామా చేసేశారు. కొందరు సొంత వ్యాపారాలు, నమస్తే, ఆంధ్రజ్యోతి, నవ, మన తెలంగాణలకు వలసవెళ్లారు. ఈ పరిణామాలు మార్కెట్లో జర్నలిస్టుల మిగులుకు కారణమైంది. దీంతో సంస్థ యాజమాన్యాలు సంక్షోభం, మ్యాన్ పవర్ సులభంగా దొరకడంతో ఈ యేడాది జీతాలు పెంచడం మానేశాయి. ఈ కారణంగా జర్నలిస్టుల బతుకులు ఆగమవుతున్నాయి.

మరోవైపు ఎన్నికలు ముగిసిపోవడంతో పత్రికలకు కష్టకాలం మొదలైంది. ఇప్పుడు పత్రికలకు ప్రకటనలు ఇచ్చే పార్టీలు లేవు. ప్రభుత్వం కూడా కఠిన నిబంధనలతో టైట్ చేస్తుండడంతో పత్రికా యాజమాన్యాలకు నిధుల కొరత ఎక్కువైంది. కొన్ని ఇచ్చే కార్పొరేట్ యాడ్స్ తప్పిస్తే ఇన్ కం వచ్చే సోర్స్ తగ్గిపోయింది. పత్రికలకు సొంతంగా నిధులు ఖర్చు పెట్టే పత్రికాధిపతులు లేరు. అందుకే సిబ్బందిని తగ్గించడం.. జీతాలు పెంచకపోవడం చేస్తున్నారు. మళ్లీ ఏవైనా ఎన్నికలు రావడమో.. ఏదైనా మంచి రోజులు రావడమో జరగాలి. లేదంటే జర్నలిస్టుల బతుకులు మరో నాలుగేళ్ల దాకా మారేలా లేవు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *