పత్రికలను నిండా ముంచుతున్నది వాళ్లే..

పత్రికలను ఎంతో ధృఢ చిత్తంతో ప్రారంభిస్తాం. కానీ అందులో చేరే సిబ్బందే అందినకాడికి దోచుకుంటూ పత్రికలను సర్వనాశనం చేస్తున్నారు. నాటి ఉదయం నుంచి నేటి వార్త, సూర్య, సాక్షి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి,ఈనాడు వరకు అన్నింట్లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగుల దోపిడీకి సంస్థలు సంకనాకిపోతూనే ఉన్నాయి. ఇలా దోపిడీకి ఎక్కువగా గురై కనుమరుగైపోయిన వాటిల్లో ప్రదానమైన పత్రిక సూర్య దినపత్రికనే..

సూర్య దినపత్రికను 2007లో నూకారపు సూర్యప్రకాశ్ రావు ప్రారంభించారు. ఆయన హైదరాబాద్ సమీపంలో వివాదాస్పద నాగర్ దుల్ భూములను కొల్లగొట్టి బ్యాంకుల ద్వారా భారీ గా రుణంపొంది. రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాడనే ఆరోపణలున్నాయి.. ఇవన్నీ బయటపడవద్దనే సూర్య పత్రికను తీసుకొచ్చారని వార్తలు వినపడ్డాయి.. ఆ సమయంలో సూర్యలో ఈనాడు, ఆంధ్రజ్యోతి నుంచి వచ్చిన జర్నలిస్టులు భారీ జీతాలు పొందారు. అదలా ఉంచితే సూర్య పత్రిక ప్రారంభమైన ఏడాదిలోపే జీతాల వ్యవహారాలు చూసే ఒక ఉన్నతస్థాయి ఉద్యోగి అందరికీ జీతాలు ఒక నెల బ్యాంకులో వేయకుండా దాదాపు 6 కోట్లు పట్టుకొని అప్పట్లో చెక్కేయడం సంస్థను డోలాయమానంలో పడేసింది. ఆయన ఆచూకీని కష్టపడి కనుక్కొన్నా డబ్బులు మాత్రం రికవరీ కాలేదు.. అలానే చాలాసార్లు జరిగి చివరకు పత్రిక మూతపడేస్థాయికి దిగజారింది..

ఈ ఒక్క సంఘటన మచ్చుతునక మాత్రమే.. ఇలాంటివే సాక్షిలో, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కోకొల్లలుగా జరిగాయి.. సాక్షిలో ఓ ఏడివీటి మేనేజర్ 30 లక్షలకుపైగా యాడ్స్ లో నొక్కేసి చివరకు దొరికిపోయాడు.. ఈనాడులో కూడా స్టోర్స్ వ్యవహారాలు చూసే వ్యక్తి పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. ఆంధ్రజ్యోతి నిజామాబాద్ ఎడిషన్ లో కూడా కోట్లు కొల్లగొట్టిన మేనేజర్, బ్యూరోను రికవరీ చేసి సస్పెండ్ చేశారు..

తరుచుగా జరుగుతున్న ఈ ఉద్యోగుల దోపిడీకి అరికట్టడానికి సరపడా వ్యవస్థలను సమకూర్చుకోలేదు పత్రికల యాజమాన్యాలు.. అంతా హైదరాబాద్ నుంచే జరుగుతున్నా క్షేత్ర స్థాయిలో బ్రాంచ్ మేనేజర్లు, అకౌంటెట్లు, ఏడీవీటీ ఇన్ చార్జీలు లెక్కలు హైదరాబాద్ కు తెలియకుండా చాలా జాగ్రత్తగా నొక్కి ఏడాదిలోనే సంస్థ వల్ల కోటీశ్వరులు అయిపోతున్నారు. ఇవేమీ తెలియని పత్రికల యాజమాన్యాలు చివరకు మోసపోయి వారికి ఉద్వాసన పలుకుతున్నాయి. ఉద్యోగాలు పోయిన వారు ఎంచక్కా మరో పత్రికలో చేరి ఈ దోపిడీ దందాను కొనసాగిస్తున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.