
అధిక వర్షాల ప్రభావంతో అదిలాబాద్ జిల్లాలో నష్టపోయిన పత్తి రైతులకు నష్టపరిహారం అంచనాలను రూపొందించి, త్వరితంగా ఇప్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డిని రాష్ట్ర అటవీ& బిసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జోగు రామన్న కొరారు.
ఈరోజు సెక్రటేరియట్ లోని వ్యవసాయ శాఖ చాంబర్ లో మంత్రి పొచారంను కలిసిన మంత్రి జోగు రామన్న కుళ్ళిపోయిన పత్తి కాయలను చూపించి పరిస్థితిని వివరించారు.. ఈఏడాది అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలకు అదిలాబాద్ జిల్లాలోని జైనద్, బేల మండలాల పరిదిలో పత్తి పంట బాగా దెబ్బతిన్నదన్నారు. తడి ప్రభావం, నీరు నిలవడం, కాయలలోకి నీరు పోవడంతో పత్తి కాయలు కుళ్ళిపోయాయి, దూది నల్లగా మారింది. రైతులకు ఏమాత్రం దిగుబడి వచ్చే అవకాశం లేదు. ఈ రెండు మండలాల పరిదిలో సుమారు యాబై వేల ఎకరాలలో పత్తి పంట నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు, ఇన్సురెన్స్ అధికారులు త్వరితంగా నివేదికలను తయారు చేసి రైతులకు పరిహారం అందించాలని కొరారు.
మంత్రి జోగు రామన్న విజ్ఞాపనను పరిగణించిన మంత్రి పొచారం వెంటనే వ్యవసాయ శాఖ, ఇన్సురెన్స్ కంపెనీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ వాతావరణ ఆధారిత బీమా వర్తిస్తుందని, తక్షణమే గ్రామాల వారిగా పంట నష్టం వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఈ ఏడాది జులై 15 తారీఖును పత్తికి కటాఫ్ డేట్ గా నిర్ణయించామని, ఆలోపు ప్రీమియం చెల్లించిన రైతులతో పాటు, లోన్ తీసుకున్న రైతులందరికి ఈ బీమా పరిదిలోకి వస్తారన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేనందున, రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని మంత్రి గారు ఇన్సురెన్స్ కంపెనీలను కొరారు.
ఈసమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, IAS, నేషనల్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ AM రఘరాం, అధికారులు పాల్గొన్నారు.