పడిపోయిన చికెన్, పెరిగిపోయిన మటన్, చేపలు

బర్డ్ ప్లూ భయంతో జనం చికెన్, కోడిగుడ్లను తినడం ప్రస్తుతానికి  మానేశారు.. దీంతో ఆదివారాలు, పండుగలు, ఫంక్షన్లు, పార్టీలకు మటన్, చేపలనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.  చికెన్ అమ్మకాలు పడిపోవడం.. మటన్, చేపల మార్కెట్ దారులకు అయాచిత వరమైంది. వారు చికెన్ లోటు భర్తీ చేసుకునేందుకు ఇబ్బడిముబ్బడిగా రేట్లు పెంచేసి దండుకుంటున్నారు.

fish-selling-03_20131213094513

కరీంనగర్, కొత్తపేట (హైదరాబాద్) మార్కెట్లో మటన్, చేపల మార్కెట్ దారుల దోపిడీ శృతి మించింది. చికెన్ తినే కాలంలో సగటున మటన్ కిలో 400 పలికేది. చేపలు రవ్వ 80 నుండి 120, బొమ్మె 300, ఇతర చేపలు 200 రూపాయల ధర ఉండేది. కానీ వాటికి రెక్కలొచ్చాయి. ప్రస్తుతం మటన్ కిలో 500 రూపాయలకు చేరింది. ఇక చేపలు రవ్వ 150, బొమ్మె 400నుంచి 500 వరకు అమ్ముతున్నారు. ఇతర చేపలు 300 పైనే అమ్ముతున్నారు.

చికెన్, గుడ్ల డిమాండ్ పడిపోవడం ఏమో కానీ మటన్, చేపల వ్యాపారుల పంట పండింది. వినియోగదారుల అవసరాలే ప్రాతిపదికలన డిమాండ్ ను బట్టి రేటును అమాంతం పెంచి లాభాలు గడిస్తున్నారు. ఇప్పటికైనా చికెన్ పై ప్రజలకు అవగాహన కల్పించి వాటి వాడాకాన్ని పెంచాల్సి ఉంది. దాంతో పాటు ఈ మటన్, ఫిష్ వ్యాపారుల అడ్డగోలు ధరలకు కళ్లెం వేయాల్సిన బాధ్యత అధికారులదే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *