పట్టిసీమలో వాటా కోసం న్యాయపోరాటం: మంత్రి హరీశ్ రావు

తెలంగాణకు వాటాపై కేంద్రం ఉదాసీనత.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో,సుప్రీంకోర్టులోనూ పోరాటం.

ఎన్. ఎస్.పి.ఆధునీకరణ పనులు 95 శాతం పూర్తి.

కల్వకుర్తి కేటాయింపుల పెంపుదల.

పూర్వ ఆదిలాబాద్ లో ఇరిగేషన్ కు 3,000 కోట్లు.

నారాయణఖేడ్ కు కాళేశ్వరం.

పట్టిసీమ ప్రాజెక్టులో 45 టి.ఎం.సి.ల కృష్ణా నీటి వాటా కోసం గట్టిగా పోరాడుతున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు శాసనమండలికి తెలిపారు. కృష్ణాలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తో పాటు సుప్రీం కోర్టు లోనూ న్యాయ పోరాటం సాగిస్తున్నట్టు ఆయన బుధవారం నాడు మండలి ప్రశోత్తర కార్యక్రమంలో తెలిపారు.పట్టి సీమ ప్రాజెక్టు ద్వారా 100 టి.ఎం.సి.ల కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లించుకున్నదని మంత్రి చెప్పారు. అందులో 45 టి.ఎం.సీలు తెలంగాణ హక్కు అని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో,కృష్ణా బోర్డు తో అనేక సార్లు చర్చలు జరిపినా,ఫలితం లేకపోయిందని హరీశ్ రావు అన్నారు. గతంలో కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి, ప్రస్తుత మంత్రి గడ్కరీ తో పలు మార్లు మాట్లాడినా స్పందించలేదన్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణా నీటి మల్లింపులో తెలంగాణకు న్యాయమైన హక్కు రావాల్సి ఉందన్నారు.పాలేరు పాత కాల్వ రికార్డు సమయంలో నాలుగు నెలల్లోనే ఆధునీకరణ పనులు పూర్తి చేసామని గుర్తు చేశారు.చిట్టచివరి రైతుకు సైతం నీరందేలా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులు  వచ్చే వానాకాలం పూర్తి చేసి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సాగర్ ఎడమ కాలువ కింద పూర్తి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని తెలియజేశారు.ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన నాగార్జున సాగర్ ఆధునీకరణ పనులకుగాను వరల్డ్ బాంక్ ర్యాంకింగ్ లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. పాలేరు పాత కాలువ ఆధునీకరణ ప్రాజెక్టు నిర్మాణం మరో చరిత్రను సృష్టించిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువను ఆధునీకరించకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మధిర,బోనకల్,ముదిమాణిక్యం తదితర ప్రాంతాల్లో లక్ష ఎకరాల గ్యాప్ ఆయకట్టుకు నీరందేది కాదని ఇరిగేషన్ మంత్రి అన్నారు.

pattiseema project

నాగార్జునసాగర్ ఎడమకాలువ పరిధిలో ఈ ఏడాది 6 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించినట్టు ఆయన చెప్పారు.హైదరాబాద్ జంటనగరాల వాసుల తాగునీటి అవసరాలకు 5 టి.ఎం.సి. ల నీటిని నిల్వ ఉంచినట్టు హరీశ్ రావు తెలిపారు.అటు కృష్ణా ,ఇటు ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ తాగునీటి కోసం సిద్ధంగా ఉంచామని అన్నారు. రాష్ట్ర రాజధాని ప్రజలేవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదన్నారు.నల్లగొండ జిల్లాలోని బ్రాహ్మణవెల్లంల రిజర్వాయర్ పనులన్నింటినీ వచ్చే వానాకాలానికి పూర్తి చేయనున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు.నల్లగొండ,నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక లక్ష ఎకరాలకు సాగునీరందించనున్నట్టు చెప్పారు.ముందుగా వచ్చే వానాకాలం నాటికి 40 చెరువులను నింపేందుకు ప్రణాలికను అమలు చేయనున్నట్టు హరీశ్ రావు తెలిపారు.కల్వకుర్తి ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కేవలం 25 టి.ఎం.సి.ల కేటాయింపులు ఉండగా,తాము అధికారంలోకి వచ్చింతర్వాత దాన్ని 40 టి.ఎం.సి.లకు పెంచినట్టు హరీశ్ రావు తెలియజేశారు.వలసలు,ఆకలి,కరవుకు నిలయంగా ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రూపు రేఖలు మారిపోయాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు.ఈ సారి 27 టిఎంసి ల నీటిని వాడామని తెలిపారు.రెండు పంటలకు నీరందించామని,2.50 లక్షల ఎకరాలకు ఈ సారి సాగునీరందించినట్టు ఇరిగేషన్ మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద సాగునీటి అవసరాల కోసం దాదాపు 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.శ్రీరాం సాగర్ పునరుజ్జీవ పథకం కింద నిర్మల్ జిల్లాలో పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పధకాన్ని చేపడుతున్నట్టు చెప్పారు.ఇందుకు గాను డి.పి.ఆర్.సిద్ధమవుతున్నట్టు హరీశ్ రావు తెలిపారు.నిర్మల్, ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించేందుకు 1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సదర్ మాట్ ప్రాజెక్టు 50 సంవత్సరాల కల అని 550 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.ఈ ఏడాదే నిర్మల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగునీరందనుందని తెలిపారు.ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన 6 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులను దాదాపు 500 కోట్లతో పూర్తి చేయనున్నట్టు చెప్పారు.దాదాపు ఆరు దశాబ్దాలుగా కేవలం ఎన్నికల నినాదంగా మిగిలిన లోయర్ పెనుగంగ కు టిఆర్ ఎస్ మోక్షం కల్పించిందన్నారు.బడ్జెట్ లో నిధులు కేటాయించామని గుర్తు చేశారు.దాదాపు 1000 కోట్లతో బ్యారేజీలు,మరో 600 కోట్లతో 3 రిజర్వాయర్ల పనులు చేపడుతున్నట్టు చెప్పారు.మిషన్ కాకతీయ 4 వ దశలో ఉమ్మడి ఆదిలాబాద్ లో కొత్త చెరువుల నిర్మాణానికి 350 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలియజేశారు.ఈ జిల్లాలోనే అత్యధికంగా 28 కొత్త చెరువుల నిర్మాణాన్ని ప్రభుత్వం తలపెట్టినట్టు తెలిపారు.5.3 టి.ఎం.సి.ల సామర్ధ్యంతో చేపడుతున్న కుప్టి లిఫ్ట్ ఇరిగేషన్ పధకాన్ని పూర్తి చేస్తే కుంటాల జలపాతంలో 365 రోజులూ నీల్లుంటాయని, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని మంత్రి చెప్పారు.ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం బాగా వెనుకబడి ఉన్నదున ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యెక శ్రద్ధ చూపుతున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టును నారాయణఖేడ్ వరకు విస్తరిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.

pattiseema project 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.