పట్ట(ని)భద్రులు

275315-voting1

పట్టభద్రులు ఎన్నికలు వచ్చే సరికి పట్టని భద్రులుగా మారారు. ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో తెలంగాణలోని రెండు నియోజకవర్గాల్లో ఓటు వేసేందుకు పట్టభద్రులు గడప దాటలేదు. దీంతో చాలా తక్కువగా ఓటు శాతం నమోదైంది. అదే ఆంధ్రప్రదేశ్ లోని రెండు నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్ స్థానాల్లో వరుసగా 40.67, 51 శాతం నమోదై సగానికి పైగా పట్టభద్రులు ఓట్లు వేసేందుకు ముందుకు రాలేదు. అదే ఆంధ్రాలో తూర్పుగోదావరి, కృష్ణా స్థానాల్లో 83,70శాతంలు నమోదయ్యాయి.

హైదరాబాద్ లో యువత తీరు మరీ ఘోరంగా తయారైంది. ఎన్నడూ లేనంతగా 40 శాతం నమోదైందంటే ఇక్కడి పట్టభద్రుల తీరు ఎంతో ఘోరంగా విధంగా తెలుసుకోవచ్చు. ఇక వరంగల్ నుంచి సగం మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఈ ఓట్ల సాధారణ ఎన్నికలు కాకపోవడం.. ప్రచారం లేకపోవడంతో పాటు ఓటర్లు ఎక్కడున్నారో గుర్తించి ప్రచారం చేయకపోవడం కూడా ఓట్ల శాతం తగ్గడానికి కారణం. ఇకముందైనా పట్టభద్రులు మారి క్రియాశీల రాజకీయాను ప్రభావితం చేసేలా ఓట్లు వినియోగించుకోవాలని ప్రతిఒక్కరూ కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *