పచ్చపార్టీ నేతల వెచ్చటి ఫైట్

0111111

వారిద్దరు ఒకప్పుడు పచ్చ పార్టీలో సీనియర్ నేతలు.. తెలుగు దేశం పార్టీకి తెలంగాణలో కీలక నేతలు.. కానీ తెలంగాణ ఏర్పాటు పచ్చపార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. టీడీపీలో ఉన్న కడియం శ్రీహరి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిపోయారు. కానీ టీడీపీ నేత ఎర్రబెల్లి కూడా టీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయమైనా.. కొన్ని కారణాల వల్ల ఆయన టీడీపీలోనే ఉండిపోయారు. ఇదిలా ఉంచితే..

వీరిద్దరు ఆదివారం వాగ్వాదం చేసుకున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లిలో  చెరువు పూడికతీత పనులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కడియం పక్కనే ఎర్రబెల్లి కూర్చున్నారు.

‘తెలంగాణ వచ్చినంక కూడా ఆంధ్రా పార్టీల కింద పనిచేయడం సరికాదు’ అని అన్నారు కడియం. దీనికి ఎర్రబెల్లి స్పందిస్తూ.. నువ్వు ఆంధ్రా బాబు దగ్గర పనిచేయలేదా.? అని కడియం ను ప్రశ్నించారు. స్టేజీ మీదనే ఇలా ఇద్దరు సీనియర్ నేతలు పోట్లాడుకోవడం సభికులను, నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *