Breaking News

పందులు పసిపాప పై దాడి చేసే దౌర్భాగ్యం

pigs

కరీంనగర్ : కరీంనగర్ లో దారుణం వెలుగుచూసింది.. పందులు స్వైర విహారం చేసి ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి.. 3 ఏళ్ల వయసున్న కరీంనగర్ లోని ఖర్ఖానగడ్డ మార్కెట్ కమిటీ వద్ద మంగళవారం ఆడుకుంటున్న  ఆదిత్యపై పందులు ఒక్కసారిగా దాడిచేశాయి.. ఓ పంది బాలుడిని నోట కరుచుకొని లాక్కెల్లింది.. బాలుడి అరుపులు విన్న తల్లి అరుణ కర్రతో పందులను కొట్టి బాలుడిని విడిపించిన దౌర్భాగ్య పరిస్థితి..

దీంతో కాళ్లు చేతులకు తీవ్ర గాయాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించగా రెండు చేతులు విరిగినట్లు సమాచారం.  కాగా మున్సిపాలిటీ నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టం కనిపించింది. పందులు ఒక బాలుడిపై దాడి చేసేంతవరకు వాటిని విచ్చలవిడిగా తిరగనిచ్చిన సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *