పంట ఉత్పత్తి, గిట్టుబాటు ధర, నికర ఆధాయం కలిపి పెరిగితెనే రైతులు రుణ విముక్తులవుతారు:పోచారం

హైదరాబాద్:

 

పంట ఉత్పత్తి, గిట్టుబాటు ధర, నికర ఆధాయం కలిపి పెరిగితెనే రైతులు రుణ విముక్తులవుతారని, ఆ దిశగా శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి కోరారు.

 

ఈరోజు రాజెంద్రనగర్ లోని నార్మ్ ఆడిటోరియంలో కౌశాల్ వికాస్ సె కృషి వికాస్ లో  బాగంగా మెనేజ్ (MANAGE) ఆద్వర్యంలో జరిగిన “రీజనల్ వర్క్ షాప్ ఆన్ స్కిల్ డవలప్ మెంట్ ఇన్ అగ్రికల్చర్” ను ప్రారంభించిన మంత్రి గారు అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ నేడు దేశంలో వ్యవసాయంపై వచ్చే ఆదాయం రైతుల జీవన వ్యయానికే సరిపోతుంటే ఇక వారి కుటుంబాలకు మెరుగైన జీవితం ఎలా అందుతుందన్నారు. తక్కువ ఆదాయంతో రైతు కుటుంబాల పిల్లలు నాణ్యమైన విద్యకు, మెరుగైన జీవన విదానానికి, దూరం అవుతున్నారని మంత్రి గారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని కాని అంతే మొత్తంలో రైతుల ఆధాయాలు పెరగలేదన్నారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైన రైతులు ఇంకా రుణాల కోసం బ్యాంకులపై ఆదారపడటం శోచనీయమన్నారు.

కేంద్ర బడ్జెట్ లో ప్రతి ఏడాది వ్యవసాయ రుణాలను పెంచుతున్నారు. కాని అసలు రుణమే అవసరం లేకుండా స్వంతంగా పెట్టుబడులను సమకూర్చుకొగలిగే స్థితికి రైతులు చేరుకోవాలన్నారు. రైతులు రుణాల కోసం కాదు లాభాలను డిపాజిట్ చేయడానికి బ్యాంకులకు వచ్చే రోజు రావలన్నారు.

 

1947 లో 50 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న దేశ ఆహార దాన్యాల దిగుబడులు నేడు 2017 లో 272 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరడం సంతోషమే అయినా సగటు దిగుబడులలో ఇతర దేశాలతో పోల్చినప్పుడు తక్కువగా ఉన్నాయన్నారు. ఇండియాలో వరి దిగుబడి హెక్టారుకు 3.7 టన్నులు కాగా, చైనాలో 6.77, జపాన్ లో 6.74, ఇండోనేషియాలో 5.13 గా ఉందన్నారు. అదే విదంగా గోదుమలలో ఇండియా 3.17 టన్నులు కాగా, చైనా 5, ఫ్రాన్స్ 7.6 టన్నులు గా ఉందన్నారు.

శాస్ర్తవేత్తల పరిశోదనలు ప్రయోగశాలలు, పేపర్ లనుండి రైతుల పొలాలకు చేరి రైతులు వాటిని వాస్తవీకంగా ఆచరించి ప్రయోజనం పొందినప్పుడే  నిజమైన ప్రయోజనం కలిగినట్లన్నారు. వ్యవసాయంతో పాటు అనుబంద రంగాలపై రైతులకు ఆసక్తి కలిగించాలన్నారు. వ్యవసాయంతో ఆహార దాన్యాల ఉత్పత్తి పెంచుతూ అనుబంద రంగాల ద్వారా రైతులకు అదిక ఆధాయం కలిగించాలన్నారు.

 

రాష్ట్రంలో పాలీహౌస్ ల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యదిక ప్రోత్సాహం కల్పిస్తు 75 శాతం సబ్సిడీని ఇస్తున్న ఎకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనన్నారు. ఎకరాకు 40 లక్షలు ఖర్చు కాగా 30 లక్షలను సబ్సిడిగా సమకూరుస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 1000 ఎకరాలలో పాలీహౌస్ ల నిర్మాణానికి అనుమతులిచ్చామని, రాబోయే ఏడాదిలో 3000 ఎకరాలలో నిర్మించడానికి సహకారం అందించాల్సిందిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కోరగా అందుకు ఆయన అంగీకరించారన్నారు.

 

అదేవిదంగా దేశంలోనే మొదటి సారిగా ప్రతి 2000 హెక్టార్లకు ఒక AEO ను నియమించామన్నారు. వ్యవసాయంలో భూసార పరీక్షలది అత్యంత ముఖ్యమని, రాష్ట్రంలో ప్రతి AEO పరిదిలో ఒక మిని భూసార పరీక్ష కేంద్రం నెలకొల్పడానికి నిర్ణయించామని ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చాల్సిందిగా తాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రాధామోహన్ సింగ్ ను కొరానన్నారు.

 

 

వ్యవసాయ రంగం బాగు పడాలంటే సాంకేతికత పెరగాలి, పెట్టుబడులు పెరగాలి, యంత్రీకరణ పెరగాలి ఈ దిశగా అందరం కలసి కట్టుగా కృషి చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అనే విదంగా మార్చాలన్నారు.

 

ఈ వర్క్ షాపులో రాఘవేంద్ర సింగ్, IAS, అడిషనల్ సెక్రెటరీ, MOA-GOA, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రెటరి, పార్ధసారది IAS , వి. ఉషారాణి,IAS  డైరెక్టర్ జనరల్, MANAGE, డా, వి. ప్రవీణ్ రావు, వైస్ చాన్సలర్  PJTSAU. మొత్తం 8 రాష్ట్రాల నుంచి 400 మంది వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *