న‌గ‌రంలో ఫుట్‌పాత్‌ల‌పై 832 అక్ర‌మ నిర్మాణాల తొలగింపు

 
 హైద‌రాబాద్‌లోని ఫుట్‌పాత్‌ల‌పై చేప‌ట్టిన అక్ర‌మ నిర్మాణాల తొల‌గింపుకు చేప‌ట్టిన ప్ర‌త్యేక డ్రైవ్‌లో భాగంగా నేడు శనివారం నాడు 832 అక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన‌ట్టు జీహెచ్ఎంసీ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్‌కంపాటి తెలిపారు.  విశ్వ‌న‌గ‌రంగా రూపొందుతున్న హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫుట్‌పాత్‌ల‌పై న‌డిచే హ‌క్కును న‌గ‌ర‌వాసుల‌కు క‌ల్పించేందుకు ఫుట్‌పాత్‌ల‌పై అక్ర‌మ నిర్మాణాల తొల‌గింపుకు చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో భాగంగా న‌గ‌రంలో ఫుట్‌పాత్‌ల‌పై అక్ర‌మ నిర్మాణాల‌ను తొలగిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. నేడు చేప‌ట్టిన స్పెష‌ల్ డ్రైవ్‌లో 621 శాశ్వ‌త అక్ర‌మ‌ణ‌ల‌ను, 211 మూవ‌బుల్ అక్ర‌మ‌ణ‌ల‌ను మొత్తం 832 ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించామ‌ని ఆయ‌న తెలిపారు.  న‌గ‌రంలోని ఫుట్‌పాత్‌ల‌పై నిర్మించిన శాశ్వ‌త నిర్మాణాల‌ను మాత్ర‌మే తొల‌గిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల  నాలుగు రోజులలో చేప‌ట్టిన స్పెష‌ల్ డ్రైవ్‌లో 5వేల‌ అక్ర‌మ నిర్మాణాల‌ను తొల‌గించామ‌ని, మ‌రో 550 క‌ట్ట‌డాల‌ను స్వ‌చ్ఛందంగా తొల‌గించుకున్నార‌ని గుర్తుచేశారు. ప్ర‌తి వారంలో ఒక రోజు అక్ర‌మ క‌ట్ట‌డాల తొల‌గింపు డ్రైవ్‌ను చేప‌డుతామ‌ని తెలిపారు. తాము చేప‌ట్టిన స్పెష‌ల్ డ్రైవ్‌కు ఊహించిన‌దానిక‌న్నా అధికంగా ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు న‌గ‌ర‌వాసుల నుండి పూర్తిస్థాయి మ‌ద్ద‌తు ల‌భించింద‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి తెలిపారు.  ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపులో స్వ‌ల్ప సంఘ‌ట‌న‌లు మిన‌హా ఏవిధ‌మైన అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్తం కాలేదని ఆయ‌న అన్నారు.  చిరు వ్యాపారులు, స్ట్రీట్ వెండర్లకు ఏమాత్రం ఇబ్బందులు క‌లిగించ‌లేదని,  తొల‌గించిన అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను తిరిగి నిర్మిస్తే కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.
IMG-20180721-WA0124 IMG-20180721-WA0281 IMG-20180721-WA0286

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *