Breaking News

న్యూ మీడియా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా: ఐజెయు సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్

న్యూ మీడియా సమస్యను పరిష్కారం కోసం కృషి చేస్తా: ఐజెయు సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్

ఆన్ లైన్ మీడియాకు గుర్తింపుతో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్ర్రానిక్ మీడియా జర్నలిస్టుల మాదిరిగా ప్రభుత్వ సౌకర్యాల వర్తింపు కోసం కృషి చేస్తామని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ హమీ ఇచ్చారు. ప్రస్తుతం ఫ్రింట్ అండ్ ఎలక్ట్ర్రానిక్ మీడియా కన్నా అత్యంత వేగంగా ప్రపంచానికి వార్తలు అందజేస్తున్న ఆన్ లైన్ మీడియా నిర్వాహకులు మొదటి సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం హైదరాబాద్ దేశోద్ధారక భవన్ లో జరిగిన తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆవిర్భావ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హజరయ్యారు. పొలిటికల్ ఫ్యాక్టరీ డాట్ కామ్ నిర్వాహకుడు అయిలు రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ఆన్ లైన్ మీడియా నిర్వాహకులు సంఘటితమైతే వీరికి తోడ్పాటునివ్వడానికి ఇండియన్ జర్నలిస్టుల సంఘం, తెలంగాణ రాష్ట్ర్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సిద్ధంగా ఉందన్నారు. గతంలో ప్రింట్ మరియు ఎలక్ట్ర్రానిక్ మీడియాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన జర్నలిస్టులు ప్రస్తుతం న్యూమీడియా (వెబ్ పోర్టల్ ) నిర్వహణకు ముందుకు వస్తున్నారన్నారు. సోషల్ మీడియా, ఆన్ లైన్ మీడియాల విస్రృతిని దృష్టిలో ఉంచుకుని, గత మే నెలలో భువనేశ్వర్ లో జరిగిన ఐజెయు ప్లీనరీలో ఈ రెండు మీడియాలను వర్కింగ్ జర్నలిస్ట్ చట్టంలో పొందు పర్చాలని కోరుతూ తీర్మాణం ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో కేవలం ప్రింట్ మీడియాకు మాత్రమే చట్టాలున్నాయని ఫలితంగా అందులో పనిచేస్తున్న జర్నలిస్టులకు వేతనాలు, ఇతర రక్షణలు లభిస్తున్నాయన్నారు. ఎంతో విస్రృతమైన ఎలక్ట్ర్రానిక్ మీడియా కూడా నేటికి వర్కింగ్ జర్నలిస్టు చట్ట పరిధిలో లేని విషయాన్ని గుర్తు చేశారు. ఐజెయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఆన్ లైన్ మీడియా ప్రాచుర్యం, ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్ర్రానిక్ మీడియాల మాదిరిగా ఆన్ లైన్ మీడియా జర్నలిస్టు ల సౌకర్యాల కోసం కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ఇండియన్ జర్నలిస్టుల సంఘం సహకారం ఉంటుందన్నారు. ఎలక్ట్ర్రానిక్ మీడియాకు ఎం ఎస్ ఓల లాంటి అనేక నియంత్రణలు ఉండగా ఆన్ లైన్ మీడియాకు ఎలాంటి పరిమితులు లేవన్నారు. ఐజెయు కార్యవర్గ సభ్యుడు కె.సత్యనారాయణ మాట్లాడుతూ ఆన్ లైన్ మీడియాకు రోజురోజు ప్రజాదరణ పెరుగుతుందన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు వర్తించే సౌకర్యాలన్ని ఆన్ లైన్ మీడియాలో పని చేస్తున్న వారికి వర్తింప జేయాల్సిన అవసరం ఉందన్నారు. టియుడబ్ల్యూజె రాష్ట్ర్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ నూతన సంఘానికి, కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సీనియర్ నేత కె.శ్రీనివాస రెడ్డి,  టియుడబ్ల్యూజె రాష్ట్ర్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి  విరాహత్అలీ నూతన సంఘానికి శుభాకాంక్షలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *