న్యూజిలాండ్ సెమీస్ కు.. పాకిస్తాన్ ఇంటికి..

టీట్వంటీ ప్రపంచకప్ లో మంగళవారం జరిగిన కీలక మ్యాచ్ లో న్యూజిలాండ్ పాకిస్తాన్ ను ఓడించింది. టోర్నీలో ఇప్పటివరకు అపజయం అన్నది లేకుండా దూసుకుపోతున్న న్యూజిలాండ్ అదే స్థాయిలో పాకిస్తాన్ పై విజయ ఢంకా మోగించింది..

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కు ఓపెనర్ గప్టిల్ ధనాధన్ ఇన్నింగ్స్ తో భారీ స్కోరుకు బాటలు వేశాడు.. కేవలం 48 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. అతనితోపాటు రాస్ టేలర్ 23 బంతుల్లో 36 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోరు 180/5 బాటలు వేశారు.

అనంతరం 181 పరుగుల భారీ లక్ష్యసాధనకు బరిలోకి దిగిన పాకిస్తాన్ ఏ దశలోనూ విజయం వైపు పయనించలేదు. షార్జీల్ ఖాన్ 25 బంతుల్లో 47 పరుగులు చేశాడు. షేజాద్ 30 పరుగులు చేసి మంచి పునాది వేసిన అనంతరం వరుసగా వికెట్లు పడడంతో 158-5 పరుగులకే పాకిస్తాన్ పరిమితమై ఓడిపోయింది..

ఈ ఓటమి తో పాకిస్తాన్ ఇంటికి పోగా.. న్యూజిలాండ్ సెమీస్ చేరిన తొలి జట్టు అయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *