
ప్రపంచకప్ సెమీస్ భాగంగా మంగళవారం జరుగుతున్న సౌతాఫ్రికా-న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. వర్షం వల్ల అంతరాయం కలిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 43 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. డూ ప్లెసిస్ 82, రోసో 39, ఏబీ డివిల్లీర్స్ 65 నాటౌట్, డేవిడ్ మిల్లర్ 49 పరుగులు చేశారు.
అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం వర్షం వల్ల అంతరాయానకి గాను టార్గెట్ ను సవరించారు. అదే 43 ఓవర్లలో 298 పరుగులు చేయాలని నిర్ధేశించారు.
టార్గెట్ చేధించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు కెప్టెన్ మెక్ కల్లమ్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. కేవలం 26 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. మార్టిన్ గప్టిల్ 25, రాస్ టేలర్ క్రీజులో ఉన్నారు. కివీస్ 14.1 ఓవర్లలో 113 పరుగులతో ఆడుతోంది.