న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం

ప్రపంచకప్ తొలి టీట్వంటి మ్యాచ్ లో ఆతిథ్య భారత్ , న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది.. ప్రపంచకప్ తొలిమ్యాచ్ లో బౌలర్ల హవానే కొనసాగింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులు చేసింది. అనంతరం భారత్ తడబడి బ్యాటింగ్ లో ఘోరంగా ఆలౌట్ అయ్యింది. 18.1 ఓవర్లలో 79 పరుగులకే ఆలౌట్ అయ్యి ఓటమి పాలైంది.

న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లలో కోరే అండర్సన్ 34 పరుగులు చేసి న్యూజిలాండ్ 127 పరుగుల స్కోరుకు కారణమయ్యాడు. అనంతరం ఇండియా స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. అయినా వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ధోని 30, కోహ్లీ 23 పరుగులు పరుగులు సాధించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *