న్యూజిలాండ్ కు చెమటలు పట్టించిన బంగ్లాదేశ్

-చావు తప్పి విజయం సాధించిన కివీస్
బంగ్లాదేశ్ చిన్న జట్టు అని ఇక నుంచి ఎవరైనా ఒప్పుకోవద్దు. వారి ఆటతీరు చూసి చాలా చాలా బాగుంది. ప్రపంచకప్ లో ఇంతవరకూ ఎదురు లేకుండా.. ఒక్క ఓటమనేదే లేకుండా దూసుకుపోతున్న న్యూజిలాండ్ కు ఓటమి అంచులదాకా తీసుకెళ్లింది. వరుసగా వికెట్లు తీసి ఒత్తిడికి గురిచేసింది. ఒక దశలో న్యూజిలాండ్ ఓడిపోయేలా కనిపించింది. కానీ చివరకు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఆటగాడు వెటోరీ, బౌలర్ సోథీ చివర్లో ఓ సిక్స్, ఫోర్ కొట్టడం తో విజయం సాధించింది. 48.4 ఓవర్లలో 290/7 వికెట్లు చేసి విజయం సాధించింది.గప్తిల్ సెంచీరీ(105), టేలర్ 56 పరుగులతో రాణించారు.

అంతకు ముందు బంగ్లాదేశ్ 286 పరుగుల బారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లను సమర్థవంతం ఎదుర్కొన్న బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ప్రొఫెషనల్ ఆటగాళ్లుగా ఆడారు. బంగ్లా బ్యాట్స్ మెన్ మహ్మదుల్లా(128) సెంచరీ చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. సర్కారు 51 పరుగులతో రాణించడంతో స్కోరు 286 పరుగులు చేసింది.

న్యూజిలాండ్ కు ఛేదనలో చుక్కలు కనిపించాయి. పరుగులు చేయడానికి తడబడ్డారు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వరుసగా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ ఒత్తిడికి గురయ్యింది. చివర్లో వెటోరీ, సోథీ సిక్స్ కొట్టి విజయం అందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *