
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిన మన ఉద్యోగాల దోపిడీ ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక కూడా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టు ను కేంద్ర ఇప్పటికీ విభజించలేదు. కేంద్రంలో , న్యాయ వ్యవస్థలో ఉన్న ఆంధ్ర న్యాయమూర్తులు, అధికారులు ఇరు రాష్ట్రాలకు హైకోర్టును విభజించడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి, ఇక్కడి న్యాయవాదులకు అన్యాయం జరుగుతోంది.
గత కొద్ది రోజులుగా న్యాయవాదులు తెలంగాణ అంతటా.. ఉమ్మడి హైదరాబాద్ లోని హైకోర్టు వద్ద తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి హైకోర్టులో జడ్జీల నియామకాలు జరపడమే ఈ వివాదానికి కారణం. ఈ నియామకాల వల్ల ఏపీ మొత్తం లోకల్ గా మారి తెలంగాణ లోని న్యాయవాదులకు ఉద్యోగాలు ఏపీ వారు కొల్లగొట్టుకపోతారు. దీంతో హైకోర్టు విభజన చేసిన తర్వాతే నియామకాలు చేపట్టాలని న్యాయవాదులు కోరుతున్నారు. ఉమ్మడిగా నియమాకాలు చేపడితే ఆంధ్రావారికే ఉద్యోగాలు వస్తాయని.. తెలంగాణ వారు మోసపోతారని ధ్వజమెత్తుతున్నారు. దీంతో హైకోర్టును విభజించిన తర్వాతే నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు.
కాగా ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ సుప్రీం కోర్టు నియామకాల్లో ప్రాంతీయ భేదాలు లేవని.. కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పుడు నియామకాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ న్యాయవాదుల ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.