న్యాయబద్దంగా సంపాదించండి -పన్ను చెల్లించండి – ఆత్మగౌరవంతో బతకండి: ఈటెల

న్యాయబద్దంగా సంపాదించండి -పన్ను చెల్లించండి – ఆత్మగౌరవంతో బతకండి

వ్యాపారస్తులకు మంత్రి ఈటెల పిలుపు

ప్రాక్టికల్ టాక్సెషన్ కోసం జీఎస్టీలో పోరాడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

టాక్స్ లు అశాస్త్రీయంగా ఉండొద్దనేది మా వాదన.

నల్లధనాన్ని ఏరిపారేయాల్సిందే.

జీఎస్టీ అమలు తర్వాత పన్నుల విధానంలో గందరగోళం ఉండదని, పారదర్శకత పెరుగుతుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూవెలరీ ట్రేడ్ ఫెడరేషన్ సభ్యులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా,, న్యాయబద్ధంగా సంపాదించండి, ఆత్మగౌరవంతో బతకండి,, అని వ్యాపారస్తులను మంత్రి కోరారు. ప్రస్తుతం జెమ్స్ అండ్ జ్యూవెలరీ ఇండస్ట్రీ దేశంలో మూడు లక్షల కోట్ల వ్యాపారం చేస్తోంది. జీడీపీలో ఆరు శాతం వాటా కలిగి ఉంది. ప్రోత్సాహం అందిస్తే మరింత వాటాను దక్కించుకుంటామని, 1.25శాతం పన్ను ఉండేలా జీఎస్టీలో తమ తరఫున నివేదించాలని ఫెడరేషన్ సభ్యులు మంత్రిని కోరారు. ఇప్పటివరకు జరిగిన చర్చల్లో 4శాతం పన్ను విధించేందుకు కేంద్రం ఆలోచిస్తుందని మంత్రి తెలిపారు. ఎక్కువ మంది పన్నులు చెల్లించాలి, ఎక్కువ లావాదేవీలు జరగాలి. జీరో దందా బంద్ కావాలి అనేది తమ లక్ష్యమని మంత్రి అన్నారు. అశాస్త్రీయంగా, అడ్డగోలుగా పన్నులు విధించడం వల్ల ఎక్కువ మంది పన్ను ఎగ్గొడుతున్నారు. దొంగదారులు వెతుక్కుంటున్నారు. ప్రాక్టికల్ టాక్సెషన్ విధానం తీసుకువస్తే ఎక్కువమంది పన్నులు చెల్లించడం వల్ల రాష్ట్ర, దేశ ఖజానాకు ఎక్కువ ఆదాయం వస్తుందని నమ్ముతున్నాం అని మంత్రి అన్నారు.  డబ్బు సంపాదించేవారు పరేషాన్ కావొద్దు, డబ్బు వ్యక్తిత్వాన్ని పెంచాలి తప్ప పన్ను ఎగవేతకు దొడ్డిదారులు వెతకొద్దని మంత్రి ఈటెల సూచించారు.

eatela rajender

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *