
ఢిల్లీ, ప్రతినిధి : అమెరికాలో తన పనిమనిషికి అవసరమైన వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణల కింద అరెస్టయిన వివాదంలో కేసుల్లో చిక్కుకున్న భారత దౌత్యవేత్త, ఐఎఫ్ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రగడే తాజాగా మరో సరికొత్త వివాదంతో వార్తల్లోకొచ్చారు. ఈసారి దేవయాని చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలని కేంద్రం సీరియస్‌గా తీసుకోవడంతో ఆమె ఉద్యోగం కూడా పోయింది.
”తన భర్తకు అమెరికా పౌరసత్వం ఉందని, తన ఇద్దరు పిల్లలు కూడా పౌరసత్వం పొందినట్టు” ఆమె మీడియాకు తన వ్యక్తిగత విషయాలు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తంచేసిన విదేశాంగ శాఖ.. అమెపై విజిలెన్స్ కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించింది. అంతేకాకుండా దేవయాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆమె నుంచి వివరణ తీసుకోవడంతోపాటు ఈ కేసులో శాఖాపరమైన విచారణ కూడా కొనసాగించనున్నట్లు విదేశాంగ వర్గాలు తెలిపాయి.