నొప్పివ్వక.. తానొవ్వక..

chandrababu

చంద్రబాబు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల చేసిన ప్రసంగం నొప్పివ్వక.. తానొవ్వక అన్న తీరు లో సాగింది.. చంద్రబాబు-కేసీఆర్ కొద్దిరోజులుగా కవల సోదరుల మాదిరి ప్రేమానురాగాలు పంచుకుంటున్నారు. దీంతో ఆ దోస్తీ కంటిన్యూ కావాలనో ఏమో కానీ చంద్రబాబు గ్రేటర్ ప్రచారంలో టీఆర్ఎస్ ను కానీ.. కేసీఆర్ ను కానీ పల్లెత్తు మాట అనలేదు.. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నేనే.. అమరావతి, ఏపీని అభివృద్ధి చేసేదే మేమే అని డెవలప్ మెంట్ పై మాట్లాడి హైదరాబాద్ ప్రజలకు వల విసిరారు..

ఏపీ సీఎం చంద్రబాబు కొడుకు లోకేష్ మాత్రం కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ ను దుమ్ము దులిపేశాడు. దళితుడు సీఎం నుంచి నేటి హుస్సేన్ సాగర్ వంద అంతస్తుల వరకు కేసీఆర్ ఒక్క హామీ ని కూడా నెరవేర్చడంటూ చురకలంటించారు. ఇక బీజేపీ నేతలు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తామంటూ ఆశలు కల్పించారు. మొత్తానికి చంద్రబాబు వైఖరి టీఆర్ఎస్ కేసీఆర్ చాలా మారిందనడానికి నిన్నటి స్పీచే నిదర్శనం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *