
హైదరాబాద్ , ప్రతినిధి : శ్రీలంక, తమిళనాడు తీరాల మీదుగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, కన్యాకుమారి నుండి నైరుతి మధ్యప్రదేశ్ మీదుగా కర్ణాటక, మహారాష్ట్ర వరకు మరో అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నట్లుగా భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది.
దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.