Breaking News

నైరుతి నై అయ్యింది.. రైతు పొలం ఎండింది..

nat2

జూన్ లో తొలకరి పలకరించగానే మురిసిపోయాం.. వారం పాటు విస్తారంగా వానలు కురవగానే సంబరపడ్డాం.. ఆదిలాబాద్, వరంగల్ , ఖమ్మంలో కుండపోత వానలు పడి చెరువులకు గండ్లు పడగానే కష్టాలు తీరాయనుకున్నాం.. మిగతా జిల్లాల్లో మాత్రం అరకొర వర్షాలు పడితే.. మళ్ల కురవకపోవా అని చింతించాం.. కానీ ఏం అయ్యింది.. వానలు ముఖం చాటేసి రైతులకు కంట నీరు తెప్పిస్తున్నాయి..

వారం దాటి పది, పదిహేను రోజులవుతున్నా వానలు కురుస్తలేవు.. దీంతో పంటలు వేసుకున్న రైతుల గుండె మండిపోతోంది. పంటలు వేయని రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. వరుణ దేవ కరుణించవా అని దీనంగా అర్థిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మొక్కలు నీళ్లు లేక.. వానలు పడక ఎండిపోతున్నాయి. మొక్కల కోసం పెట్టిన కోట్ల డబ్బులు వానలు లేక వృథా అవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో రైతులు, ప్రభుత్వం పరిస్థితి దిక్కుతోచడం లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *