నే అడుగు పెడితే సమస్యలు పరారే..

వరంగల్ , ప్రతినిధి : వాహ్.. కేసీఆర్.. తెలంగాణలో మన పాలన ఎలాగుంటదో.. జనాలు రుచి చూపిస్తున్నారు సీఎం కేసీఆర్.. తాను అడుగుపెట్టిన చోట దరిద్రం రూపే లేకుండా చేస్తున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఏ సీఎం వరుసగా మూడు రోజులు ఓ జిల్లాలో స్టే చేసింది లేదు..  కానీ పాలన పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ వరంగల్ మురికి వాడలను సందర్శించి సమస్యలను పారద్రోలాలని సీఎం హోదాలో మూడు రోజులుగా జిల్లాలో ఉంటూ వారి సమస్యలు తీర్చడం చూపిస్తున్న పట్టుదల నిజంగా అందరినీ విస్మయానికి గురిచేస్తోంది..

మురికి వాడలను సందర్శిస్తూ వారి దరిద్రాన్ని కళ్లారా చూసిన కేసీఆర్ చలించిపోయారు. ఇలాంటి మురికి కాలువల్లో ఎలా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  మీ దరిద్రాన్ని పారదోలందే వరంగల్ కదలనంటూ ప్రతినబూనారు. అన్నట్టే.. మూడురోజులుగా వరంగల్ లోనే తిష్ట వేసి పేదలకు ఇళ్లు కట్టించడంలో బిజిగా ఉన్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి పట్టాలిచ్చి నాలుగు నెలల్లో ఇళ్లు నిర్మించాలని పథకం సిద్దం చేస్తున్నారు. 4 నెలల్లో మురికి వాడల్లో పక్కా భవనాలు నిర్మించేందుకు శంకుస్తాపన చేసేశారు. కేసీఆర్ దాటికి అధికారులు యుద్ధప్రాతిపదకన అక్కడి పేదలకు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు కట్టించేందుకు సర్వేలు చేసి పనులు ప్రారంభించారు.

నాయకులన్నాక రావడం .. పరామర్శించడం.. అంతో ఇంతో సాయం చేయడం మామూలుగా జరుగుతున్నా..ఇంత పట్టుదలగా పేదల సమస్యలను వింటూ వాటికి పరిష్కారాలు సూచిస్తూ.. అధికారులను పురమాయిస్తూ.. వారితో పనులు చేయిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. తాను వెళ్లాక మళ్లీ వరంగల్ మురికి వాడల పరిస్థితి మారదనుకున్నారో ఏమో వరుసగా మూడు దినాలు వరంగల్ పట్టణంలోనే ఉండి మరీ ఒక యజ్ఞంలా ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తున్నారు సీఎం కేసీఆర్.. వాళ్లకు పక్కా ఇళ్లు మూడు రోజుల్లో శంకుస్తాపన చేస్తానని చెప్పి చేసేశారు. సీఎంగా ఉండి ప్రజా సమస్యలపై స్పందిస్తున్న కేసీఆర్ ప్రజలు నాయకులు వేనోళ్ల పొగుడుతున్నారు. ఇలానే అన్ని జిల్లాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తే తెలంగాణ బంగారు తెలంగాణ కావడం ఖాయమంటూ నాయకులు సంబరపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.