నేల దిగి సాము..

కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఆకాశం నుంచి కిందకు దిగి నేల దగ్గరికొచ్చి సాగు చేసింది. ఇన్నాళ్లు పారిశ్రామిక వేత్తలు, అంకురసంస్థలు, ఐటీ, డిజిటల్ ఇండియా అంటూ సామాన్యులు, రైతులు, గ్రామీణ భారతాన్ని పెడచెవిన పెట్టిన మోడీ ఈసారి పూర్తిగా సంక్షేమ భారతాన్ని సాకారం చేసేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేశారు.. పల్లెలు, గ్రామీణ భారతానికి రూ.1.77 లక్షల కోట్లు బడ్జెట్ ను కేటాయించి సంక్షేమాన్ని పల్లెలలకు ప్రసాదించింది. ఆదాయపన్ను 2,00,000 పరిమితిని మాత్రం పెంచలేదు..

ఇక ఖరీదైన కార్లు, సిగరెట్లు, పొగాకు, విమాన ప్రయాణాలు, బ్రాండెడ్ దుస్తులు, రెస్టారెంట్ భోజనంపై భారీగా పన్ను వడ్డించింది. సామాన్యుల నిత్యావసరాల ధరను తగ్గించింది. డయాలసిస్ పరికరాలు, సెట్ అప్ బాక్స్ లు, ఇంటర్నెట్ రౌటర్స్,  ఫ్రిజ్ లు పాదరక్షల ధరల్ని తగ్గించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *