Breaking News

నేరాల నియంత్రణ, చేధన కోసం సిసి కెమెరాలు

నేరాల నియంత్రణ, చేధన కోసం సిసి కెమెరాలు

కరీంనగర్: నేరాల నియంత్రణ ఛేదన కోసం సిసి కెమెరాలు ఉపయోగపడుతాయని జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ అన్నారు. నేరాల నియంత్రణ ఛేదనలో భాగంగా సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావడం ఆహ్వనించదగిన పరిణామమని పేర్కొన్నారు. నగరంలోని రాంనగర్(41 వ డివిజన్)ప్రజలు ఆరులక్షల రూపాయల వ్యయంతొ సిసి కెమెరాల ఏర్పాటుకు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. కాలనీలో 64 సిసి కెమెరాల ఏర్పాటు పనులను మంగళవారం నాడు జిల్లా ఎస్.పి డి. జోయల్ డేవిస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడుతూ సిసి కెమెరాలతో పాటు ప్రతినిత్యం పోలీసుల పెట్రోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. కాలనీలో ఏర్పాటు చేయనున్న సిసి కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేసి పర్యవేక్షించడం జరుగుతందని చెప్పారు. కెమెరాలకు ఎలాంటి సాంకేతికలోపం తలెత్తకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు. నేరాల నియంత్రణలో భాగస్వాములవుతున్నకాలనీ వాసులను అభినందించారు. నగరంలోని మిగతా డివిజన్ల ప్రజలు కూడా 41డివిజన్ ప్రజలను స్షూర్తిగా తీసుకుని ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి. అన్నపూర్ణ, డి.ఎస్.పి రామారావు, టుటౌన్ ఇన్స్ పెక్టర్ కె.హరిప్రసాద్, కార్పోరేటర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, పారమిత విద్యాసంస్ధల ఛైర్మన్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిది మంది బాలకార్మికులకు విముక్తి:
మానవ అక్రమ రవాణ నియంత్రణ విభాగానికి చెందిన పోలీసులు మంగళవారం నాడు తొమ్మిది మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సుల్లానాబాద్ మండలం గర్రెపల్లి సమీపంలోని నర్సయ్యపల్లి ఇటుకబట్టీల్లో మానవ అక్రమ రవాణా నియంత్రణ విభాగం ఇన్స్ పెక్టర్ మహేష్ ఆధ్వర్యంలో తనిఖీచేసి తొమ్మిదిమంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. సదరు బాలురను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటి సభ్యులకు అప్పగించారు. ఈ తనిఖీలో ఎస్.ఐ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

తొమ్మిది మంది బాలకార్మికులకు విముక్తి

తొమ్మిది మంది బాలకార్మికులకు విముక్తి

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *