నేరాల చేధన, పరిశోధనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

కరీంనగర్: నేరాల పరిశోధన, చేధనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల నేరాల త్వరితగతిన చేధించబడుతాయని పేర్కొన్నారు. కరీంనగర్ డివిజన్ నేరసమీక్ష సమావేశం గురువారం నాడు కమీషనరేట్ కేంద్రంలోని దివంగత ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హల్లో జరిగింది. ఈ సందర్భంగా కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. నేరస్ధులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళ భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతలో భాగంగా ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ లను నియంత్రించేందుకు షీటీంలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. వివిధ రకాల సంఘటనల్లో నేరస్ధులని తప్పకుండా సందర్శించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్త్ర్రెవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన వారిని వారి కుటుంబసభ్యులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లకు వచ్చే బాధితులకు కనీస మర్యాదనిచ్చి ఫిర్యాదులు స్వీకరించాలని చెప్పారు. ధర్నాలు, రాస్తారోకోలు, వివిధ రకాల ఆందోళనలు నిర్వహించే వారు నిర్ణీత సమయంలోపే వారి కార్యక్రమాన్ని ముగించాలని, గంటల తరబడి కార్యక్రమాలను కొనసాగించి ప్రజాజీవనానికి ఆటంకం కలిగించినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ కర్రమబద్దీకరణ చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ సిపి టి. అన్నపూర్ణ ఎసిపి జె.రామారావులతో
పాటుగా పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.