నేరస్ధులను అరెస్టు చేసే సందర్భంలో పాస్ పోర్టులు సీజ్ చేయాలి..

కరీంనగర్: వివిధ రకాల నేరాల్లో నిందితులను అరెస్టు చేసే క్రమంలో వారి పోర్టులను కూడా స్వాధీనం చేసుకుని వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ వి.శివకుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కేసుల వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ విచారణలకు వీలుగా కంప్యూటరీకరణ చేయడం జరుగుతున్నదని పేర్కొన్నారు.
సోమవారం నాడు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని దివంగత జాన్ విల్సన్ స్మారక ఓపెన్ ఏయిర్ థియేటర్ ఆవరణలో అర్దవార్షిక నేరసమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి.శివకుమార్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణకు పాల్పడే వారిపై కేసు నమోదు చేయడంతోపాటు వాహనాలను కూడా సీజ్ చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణ నియంత్రణకు అవసరమైతే మరిన్ని చేక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. భూగర్బ గనులశాఖ అధికారుల సహాకారంతో ఇసుక అక్రమ రవాణ నియంత్రణకు పగడ్బందీ చర్యలు తీసుకోనున్నమని చెప్పారు. ప్రేమవివాహాలు, అదృశ్యాలకు సందంధించిన కేసుల్లో సదరు యువత మేజర్లు అయినట్లయితే వారి అభిప్రాయాలను అనుగుణంగా కేసులను నమోదుచేయాలని సూచించారు. నేరరహిత గ్రామాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నేరరహిత గ్రామాల అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజురు చేయానున్నదని తెలిపారు.ప్రతి పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు.జిల్లాలో జరుగుతున్నా నేరాల్లో 30 శాతం నేరాలు భూవివాదాలు, రోడ్డు ప్రమాదాలు, మోసాలకు సంబంధించినవి ఉంటాయని వివరించారు. అన్ని రకాల నేరాలపై సమీక్ష నిర్వహించడంతో పాటు వాటి నియంత్రణకు ముందస్తు చర్యలను సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, అడిషనల్ ఎస్పీ బి.జనార్ధన్ రెడ్డి, విజిలెన్స్ ఏడి సుధాకర్ రెడ్డి, ఆర్ టిసి ట్రాఫిక్ మేజర్ మధుసూధన్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాంరెడ్డి, మంజుల, వివిధ సబ్ డివిజన్ లకు చెందిన డిఎస్పీ లు, స్పెషల్ బ్రాంచి డిఎస్పీ ఎ.ఆర్.డిఎస్పీ కోటేశ్వరరావు, ఎస్.బి.ఐ శ్రీనివాసరావులతో పాటుగా పలువురు పోలీసు అధికారులు పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *