నేపాల్ కు భారత్ 6వేల కోట్ల సాయం

నేపాల్: భూకంపాలతో అట్టుడికిన నేపాల్ కు భారత్ భారీ సాయం చేసింది. దాదాపు 6000 కోట్ల సాయం ప్రకటించారు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. ఆమె ప్రస్తుతం నేపాల్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె నేపాల్ కు వరాలు ప్రకటించారు.

ఇటీవల సంభవించిన భూకంప ధాటికి నేపాల్ నేలమట్టమైన సంగతి తెలిసిందే.. ఆ సమయంలోనే భారత సైనికులు ‘ఆపరేషన్ మైత్రి’ చేపట్టి ఆదుకున్నారు. ఈ నేపథ్యంలోనే సుష్మ నేపాల్ లో పర్యటించి ఆర్థికసాయం ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *