నేపాల్ కు భారత్ ‘ఆపరేషన్ మైత్రి’

ఖట్మాండు: భారీ భూకంపంతో అతలాకుతలం అయిన నేపాల్ కు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. ‘ఆపరేషన్ మైత్రి’ పేరుతో ప్రారంభమైన ఈ సాయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ప్రారంభించి ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆపరేషన్ మైత్రిలో భాగంగా 25 చాపర్లు, హెలికాప్టర్లు సైనికులతో నేపాల్ తరలివెళ్లాయి. అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.  అంతేకాదు భారత వాయసేనకు చెందిన 5 అతిపెద్ద విమానాల్లో బాధితుల కోసం మందులు, దుపట్లు, కావాల్సిన నిత్యవాసరాలు, ఆహార పొట్లాలను తరలిస్తున్నారు. భాధితులు వీటన్నింటిని అందజేస్తారు. అలాగే అక్కడి శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని యుద్ధప్రాతిపదకన రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయలుదేరివెళ్లాయి. మొత్తానికి భారత ఆపన్నహస్తంతో పేద దేశమైన నేపాల్ ఇప్పుడిప్పేడే కోలుకుంటోంది.

nepal-earthquake7591rescue2_650_042615114043

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *