నేనెవరో తెలుసా..? ఎంపీ వినోద్ ను ప్రశ్నించిన ఫొటోగ్రాఫర్

అది పార్లమెంటు జరుగుతున్న సమయం.. కరీంనగర్ ఎంపీ వినోద్ పార్లమెంటు మెట్లు ఎక్కుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో ఓ పెద్దాయన.. చూస్తే జర్నలిస్టులాగా ఉన్నాడా.. తూలి పడిబోయాడు.. అప్పుడు ఎంపీ వినోద్ ఆయన్ను పట్టుకున్నాడు..

పట్టుకున్న ఎంపీని దీర్గంగా చూసిన ఆ పెద్దాయన .. నువ్ ఎంపీవా అని ప్రశ్నించాడు.. అందుకు అవును అన్నట్టు తలూపిన ఎంపీ వినోద్ మీరెవరు అని ప్రశ్నించాడు.. అప్పుడు పార్లమెంటు ముందు మౌన ముద్రలో ఉన్న గాంధీ విగ్రహం వైపు చూపించాడు ఆ పెద్దాయన.. ‘ఆ మౌన ముద్ర గాంధీని అలా ఉండగా ఫొటో తీసింది నేనే.. నా ఫొటోనే అక్కడ చెక్కించారు తెలుసా’ అని ఎంపీ వినోద్ కుమార్ కు చెప్పాడట సునీల్ జాన్హా అనే ఫొటోగ్రాఫర్.. ‘ ఆ ఫొటోను తీసిందే తానేనని.. శిల్పంగా చెక్కింది మాత్రం రాంసూతార్.. అని చెప్పాడట సునీల్ జాన్హా .  ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయి వృద్దాప్యంతో ఉన్నారు..

ఈ సంఘటన ను ఎంపీ వినోద్ కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవంలో గుర్తు చేసుకున్నారు. ఫొటో గ్రాఫర్ల గొప్పతనాన్ని ఈ చిన్న అనుభవంతో వివరించాయన..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.