Breaking News

నేను మోడీని ఎలా నిలదీయను..?

pavan

విజయవాడ : కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు ఎం చేయాలో అది చేస్తామని.. వారి మాట వెనక్కి తీసుకుంటే బీజేపీ నష్టపోతుందని.. కాంగ్రెస్ లాగే బీజేపీ పని అయిపోతుందని, నేను మోడీని ఎమ్మెల్యే, ఎంపీ కూడా కాదు ఎలా నిలదీయాలని సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ అన్నారు.

పవర్ కళ్యాణ్ ఇవాళ విజయవాడ వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటి అయ్యారు.. రాజధానికి భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడడానికే పవన్ వెళ్లానని ప్రచారం జరిగినప్పటికీ దాని వెనుక గ్రేటర్ ఎన్నికల్లో పోటీ , పొత్తులపై చర్చించడానికి వెళ్లినట్లు తెలుస్తోంది..

పవన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని శంకుస్థాపనకు తానే రాలేకపోయానని.. అందుకే షూటింగ్ నుంచి వచ్చాక ఏపీ సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడినట్టు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *