
గుంటూరు, ప్రతినిధి : గుంటూరు రాజధానికి భూములిచ్చిన రైతులతో సమావేశమైన పవన్ కళ్యాన్ వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆవేశంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాన్. రాష్ట్ర విభజన, ప్రాంతీయ విభేధాల నేపథ్యంలో తనను కేసీఆర్ పదే పదే నువ్వు ఆంధ్రా కొడుకువి.. అని అనడం బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రావారిని వేరుగా చూడొద్దని రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో విద్వేషాలు రెచ్చగొట్టవద్దని సూచించారు.