నేతల్ని లాగేందుకు తుమ్మల ఆపరేషన్

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.. ఖమ్మం బరిలో టీఆర్ఎస్ తరపున లక్ష్మీనారాయణ , సీపీఐ తరఫున పువ్వాడ నాగేశ్వరరావులు బరిలో నిలిచారు. టీడీపీ, కాంగ్రెస్ లు సీపీఐ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో పోరు రసవత్తరంగా మారింది..

ఇక ఖమ్మం నుంచి ఎలాగైనా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలనే పట్టుదలతో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సొంత జిల్లాలో పేరు ప్రతిష్టను నిలుపుకునేందుకు క్యాంపులకు, నాయకులను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇందుకోసం అధికారాన్ని ఉపయోగించుకొని భారీగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లకు తాయిలాలు ప్రకటించి క్యాంపులకు తరలిస్తున్నారు. తుమ్మల, టీఆర్ఎస్ ఆఫర్లతో స్థానిక సంస్థల ఓటర్ల పంట పండింది. తమ ఎన్నికల ఖర్చు వస్తోందంటూ వారు సంబరపడిపోతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *