నేడే టీఆర్ఎస్ ప్లీనరీ..

-నాయకులందరీ రాజధాని బాట
-10నెలల పాలననపై సమీక్ష
-27న ఆవిర్భావ దినం, బహిరంగ సభ
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియంలో ప్లీనరీ మొదలవుతుంది. అధికార పార్టీ హోదాలో తొలిసారి శుక్రవారం ప్రతినిధుల సభ(ప్లీనరీ) జరుపుకుంటున్నది. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్న టీఆర్ఎస్ అధినాయకత్వం.. ఈ మూడు రోజులు ఎల్ బీ స్టేడియంలో ప్లీనరీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే..

గతేడాది సార్వత్రిక ఎన్నికల కారణంగా పార్టీ వార్షికోత్సవాన్ని నిర్వహించలేదు. అప్పుడు నిరాశ పడ్డ టీఆర్ఎస్ శ్రేణులు ఆ తర్వాత ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చారు. జూన్ 2న కేసీఆర్ టీఆర్ఎస్ సర్కారు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. టీఆర్ఎస్ అధికారం చేపట్టడంతో టీఆర్ఎస్ ప్లీనరీ భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ ప్లాన్ చేసింది. ఈ సారి ఆవిర్భావ దినోత్సవాన్ని ఓ పేద్ద పండుగలా నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. నియోజకవర్గానికి 300 మంది చొప్పున దాదాపు 36000 మంది ప్రతినిధులను పార్టీ ఆహ్వానించింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్ ఈ సభా వేదికపై ప్రకటిస్తారు. అనంతరం పదినెలల పాలనపై సమీక్షిస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *