
సిద్దిపేట : తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు జూన్ 3. ఇవాళే.. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధిపేటలో పార్టీ నాయకులు సకల ఏర్పాట్లు చేశారు. ఇక టీఆర్ఎస్ భవన్ లో ఘన ఏర్పాట్లు చేశారు. హరీష్ బర్త్ డే వేడుకలకు మంత్రులు కూడా సిద్ధమయ్యారు. హరీష్ తోనే కేక్ కట్ చేయించి పండుగలా చేసుకోవడానికి సిద్దమయ్యారు.