నేడు సూర్యగ్రహణం.. ఉదయం 4.49 నుంచి 10.05 వరకు

భారత దేశంలో బుధవారం నాడు సంపూర్ణ సూర్యగ్రహణం కనపడనుంది. తెల్లవారు జామున 4.49 నిమిషాల నుంచి ఉదయం 10.05 గంటల వరకు గ్రహణం ఉంటుంది. పశ్చిమ, వాయువ్య భారతం తప్ప దేశమంతటా ఇది కనిపిస్తుంది.
సూర్య గ్రహణం ఉదయం 4.49కి ప్రారంభమవుతుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఉదయం 6.29 నుంచి 6.47 వరకు దాదాపు 20 నిమిషాల సేపు సంపూర్ణ సూర్యగ్రహణం కలుగుతుంది. ఈ సమయంలో సూర్యడు మొత్తమే మనకు కనిపించడు.. అనంతరం కొద్దికొద్దిగా ఉదయం 10 గంటల వరకు కూడా గ్రహణం పాక్షికంగా మనకు కనపడుతుంది.
కాబాట్టి ఎన్నో రోజులకు కానీ కనిపించని ఈ అద్భుత గ్రహనాన్ని అందరూ వీక్షించండి.. గర్భిణులు మాత్రం ఇళ్లలోంచి బయటకు రావద్దని పూజారులు చెబుతున్నారు. కాగా గ్రహణం కారణంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు ఆలయాలను మూసివేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *