
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన రోజు ఈరోజే.. సెప్టెంబర్ 2న ఆయన సీఎం హోదాలో రచ్చబండ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి వెళ్తూ నల్లమల అడవుల్లో హెలీక్యాప్టర్ కూలి మరణించారు. సీఎంగా హెలీక్యాప్టర్ మిస్ అయి అప్పట్లో ఎయిర్స్ ఫోర్స్ సైతం హెలీక్యాప్టర్ అవశేషాలను వెతికారు..
చివరకు నల్లమలలోని పావురాల గుట్టలో ఆయన హెలీక్యాప్టర్ క్యూములో నింబస్ మేఘాల వల్ల కూలిపోయిందని తెలిపారు. సెప్టెంబర్ 2 న ఆయన మరణించేటప్పటికీ రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికయ్యారు. వరుసగా ఏపీలో రెండోసారి కాంగ్రెస్ అధికారం చేపట్టింది..