
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో పర్యటించనున్నారు. ముల్కనూర్ ను దత్తత తీసుకున్న కేసీఆర్ ఇది వరకు రెండు సార్లు ఆ గ్రామంలో పర్యటించి ప్రణాళికలు వేశారు. శ్రమదానం చేశారు.
నేడు మరోసారి ఆయన గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామంలోని ఇళ్లులేని కొంతమంది ఇళ్లు మంజూరు చేశారు. ఆ ఇళ్లు ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉన్నాయి. వాటిని ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్ ముల్కనూర్ లో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ నీతూ ప్రసాద్ , హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు.