నేడు తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు పండగ రోజు

చరిత్రలో ఈరోజు సువర్ణఅక్షరాలతో లిఖించదగింది

 నాలుగేళ్లలో సిఎం కేసిఆర్ చేపట్టిన పథకాలకు దేశవ్యాప్త ప్రశంసలు

 నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అన్నదే సిఎం కేసిఆర్ స్వప్నం…

 జెట్ వేగంతో ప్రాజెక్టుల నిర్మాణం…రాక్షసుల్లా అడ్డుపడుతున్న ప్రతిపక్ష నేతలు

 కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉచిత కరెంటు, వ్వవసాయానికి పెట్టుబడి ఎందుకు లేదు

 వరంగల్ లో రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

 నీటి తీరువా బకాయిలు మాఫీ చేసినందుకు సిఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

వరంగల్, మే 10 : ‘‘ చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగింది. తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి పండగ రోజు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచని, ఊహించని పథకం. ఈ పథకంతో సిఎం కేసిఆర్ దేశంలో, రాష్ట్రాల్లో చరిత్ర సృష్టించారు. కొత్త చరిత్రకు నాంది పలికారు’’ అని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతును రాజు చేసేందుకు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ గొప్ప ఆశయంతో తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గంలోనిరాయపర్తి మండలం, కొత్తూరు గ్రామంలో, వర్ధన్నపేట నియోజకవర్గం, ఐనవోలు మండలం, సింగారం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి, చెక్కులను అందించారు. రైతుల కోసం నీటి తీరువా బకాయిలు దాదాపు 800 కోట్ల రూపాయలను మాఫీ చేసినందుకు సిఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఆరు దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగ ఫలితం, సిఎం కేసిఆర్ నాయకత్వంలో ఎంతో కష్టపడి తెచ్చుకున్నతెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకునేందుకు సిఎం కేసిఆర్ అనేక అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని చెప్పారు. గత నాలుగేళ్లలోనే తన పరిపాలన దక్షతతో చేపట్టిన పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని తెలిపారు. అందరి దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షిస్తున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రం రాకముందు వ్యవసాయం పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్నారు. రైతులకు కనీసం నాలుగుగంటలు కూడా కరెంటు రాక, విత్తనాలు, ఎరువులు దొరకక చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చేసేవాళ్లన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక పార్టీ మేనిఫెస్టో రూపొందించే కమిటీకి కేసిఆర్ గారు నన్ను చైర్మన్ గా చేశారు. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ ను వ్యవసాయానికి ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చాలన్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఎలా ఇస్తారని, ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని, పంపిణీ పెంచాలని అవి పెరగకుండా సాధ్యం కాదని, మరొకసారి దీనిపై ఆలోచించాలని సిఎం కేసిఆర్ ను తాను కోరానని చెప్పారు. అయితే మనసుంటే కచ్చితంగా సాధ్యమేనని దీనిని మేనిఫెస్టోలో పెట్టమని సూచించారని చెప్పారు. అయితే ఈ నాలుగేళ్లలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు 24 గంటలు ఉచిత విద్యుత్ అందించే ఏకైక రాష్ట్రంగా తెలంగాణను దేశంలో నిలబెట్టారని చెప్పారు. అదేవిధంగా రైతులకు లక్ష రూపాయలలోపు పంట రుణాల మాఫీని కూడా మేనిఫెస్టోలో పెట్టాలన్నప్పుడు తనకు భయమైందని, కనీసం 20, 25వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని సిఎం కేసిఆర్ కు వివరించానని చెప్పారు. అయితే కేసిఆర్ గారు ఏదేమైనా లక్ష రూపాయలలోపు పంటరుణాలు మాఫీ చేయాల్సిందేనని చెప్పి దానిని కూడా మేనిఫెస్టోలో పెట్టించారని తెలిపారు. పంట రుణాలను నాలుగు విడతలుగా 17వేల కోట్ల రూపాయలు మాఫీ చేశారని, దీనివల్ల 38 లక్షల మంది రైతులు లబ్ది పొందారని చెప్పారు. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క రైతు కూడా ఎరువులు, విత్తనాల కోసం క్యూలైన్లలో నిలబడలేదన్నారు. ఇక నా తెలంగాణ కోటి రతణాల వీణ అని దాశరథి అంటే…నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణా అని సిఎం కేసిఆర్ అన్నారు. దీనిని నిజం చేసేందుకు ప్రాజెక్టులను జెట్ వేగంతో నిర్మిస్తున్నారు. నేడు కాళేశ్వరం, దేవాదుల పనుల వేగం చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నారని చెప్పారు. అయితే కొంతమంది ప్రతిపక్ష నేతలు రాక్షసుల్లా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని, వీరెవరిని లెక్క చేయకుండా ప్రాజెక్టులలో ముందుకెళ్తున్నామని చెప్పారు. రైతుకు కరెంటు, నీళ్లు, విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు మాఫీ చేస్తే సరిపోదని భావించిన సిఎం కేసిఆర్ ఇప్పుడు పంట పెట్టుబడి కోసం ఎకరానికి ఏటా 8000 రూపాయలు అందించే రైతు బంధు పథకాన్ని నేడు ప్రారంభించడం దేశ చరిత్రలో కొత్త అధ్యయనానికి తెర తీసిందన్నారు.

ఇతర రాష్ట్రాలలో పాలిస్తున్న కాంగ్రెస్, బిజెపిలు మరి ఇలాంటి పథకాలను ఎందుకు అక్కడ ప్రవేశపెట్టడం లేదో తెలపాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్నిరకాల పథకాలు అమలు చేస్తున్న ఏకైక సిఎం కేసిఆర్ అన్నారు.

పేదింట్లో ఆడపిల్ల పుట్టిందంటే, ఆ పిల్ల పెళ్లీడుకు వచ్చిదంటే తల్లిదండ్రులకు భయం. ఆ పిల్ల పెళ్లి చేయడానికి వారు పడే అవస్థలు స్వయంగా చూసిన వ్యక్తిని తానేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నాకు ఆరుగురు అక్కాచెల్లెల్లున్నారని, వారి పెళ్లిల్లు చేయడానికి నా తల్లిదండ్రులు పడ్డ అవస్థ చూశానని చెప్పారు. అయితే పేదింటి కష్టాలు తెలిసిన వ్యక్తి సిఎం కేసిఆర్ ఆడపిల్ల పెళ్లికి మేనమామలాగా మొదట్లో 51వేలు, తర్వాత సరిపోదని 75వేలు, ఇప్పుడు ఇంకా పెంచి లక్షా 116 రూపాయలు ఇస్తున్న గొప్ప సిఎం అని కొనియాడారు. వర్ధన్నపేట నియోజక వర్గం, ముల్కల గూడెంలోని ఉపేంద్ర తన బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మీ కింద 51వేలు రూపాయలు తీసుకొని ఎంత సంతోషంగా ఉందో తెలియజేసేందుకు ఆమెను వేదిక మీదకు పిలిచి ఆమెతోనే కళ్యాణలక్ష్మీ పథకం గురించి చెప్పించారు. అదేవిధంగా పేదింట్లో గర్భిణీ అయిన తర్వాత కూడా ప్రసవం వరకు పనిచేయకపోతే గడవని పరిస్థితిని గమనించిన సిఎం కేసిఆర్ గర్భిణీ స్త్రీలకు గర్భం దాల్చిన మూడు నెలలు, ప్రసవం తర్వాత మరో మూడు నెలల పాటు నెలకు 2వేల రూపాయల చొప్పున 12వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే ప్రత్యేకంగా మరో వెయ్యి రూపాయలు కలిపి 13వేల రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా జాన్సన్ అండ్ జాన్సన్ వంటి గొప్ప కంపెనీ తయారు చేసిన 15 రకాల ఉత్పత్తులతో కేసిఆర్ కిట్ ఇస్తున్నారని చెప్పారు. ఈ కిట్ లో కడియం శ్రీహరి మనవలు వాడే వస్తువులు, న్యాప్కిన్లు, పౌడర్లు, నూనెలు, వస్త్రాలు అందిస్తున్నారని చెప్పారు. ప్రసవం ముందు, తర్వాత డబ్బులు ఇస్తూ, పిల్లలకు, తల్లికి వస్త్రాలు, కేసిఆర్ కిట్ ఇచ్చి అమ్మ ఒడి వాహనంలో ఇంటి దగ్గర దించుతున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒకటేనని తెలిపారు. సంక్షేమ పథకాల్లో తెలంగాణ ప్రభుత్వం దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. 5300 కోట్ల రూపాయలతో 42 లక్షల మందికి ఆసరా పెన్షన్లను ఇస్తున్నామన్నారు.

సిఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

రైతులకు పంట రుణాలు మాఫీ చేసి, నేడు పంట పెట్టుబడి ఇస్తున్న సిఎం కేసిఆర్, బుధవారం మెదక్ జిల్లాలోని సభలో రైతుల సాగునీటి తీరువా బకాయిలు 800 కోట్ల రూపాయలను మాఫీ చేయడానికి ధన్యవాదాలుగా వర్ధన్నపేట నియోజకవర్గం, సింగారం గ్రామంలో రైతు బంధు పథకం వేదికపై సిఎం కేసిఆర్ చిత్రపటానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి, మేయర్ నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిలు పాలాభిషేకం చేశారు. బకాయిలు మాఫీ చేయడమే కాకుండా ఇకనుంచి తీరువాను రద్దు చేయడంపై కృతజ్ణతలు తెలిపారు.

రైతు బంధు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, మేయర్ నన్నపనేని నరేందర్, చైర్మన్లు గుండు సుధారాణి, గాంధీ నాయక్, వాసుదేవ రెడ్డి, మర్రి యాదవరెడ్డి, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, స్థానిక అధికారులు నేతలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *