Breaking News

నేడు కే.శ్రీనివాస్ గారి పుస్తకాల పరిచయ సభ

k-srinivas-copy-960x630

ఆయన కలం.. ఒక నిప్పు కణం.. ఆయన రచనలు రాజకీయ నాయకులకు వదిలిన తూటాలు.. రాజకీయాల్ని కదిలించేలా.. నాయకుల్లో అలజడి రేగేలా రాసిన వ్యాసాలు ఒక్కోటి ఒక బాణంలా వదిలారు. అంతటి ప్రాధాన్యం గల వ్యాసాలు కనుమరుగై పోవడమేనా.. నేటి సమాజానికి అవసరం లేదా.? అనే ఆలోచనతోనే వాటిని పుస్తకరూపంలోకి తీసుకువచ్చారు. ఆ మూడు పుస్తకాల పరిచయ సభను  కరీంనగర్ లో నిర్వహిస్తున్నారు.

తన జర్నలిజం ప్రస్థానంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే.శ్రీనివాస్ గారు పత్రికలలో రాసిన ఎడిటోరియల్ వ్యాసాలతో రూపొందించిన ‘కొత్త వంతెన’, ‘అనేక సందర్భాలు’ ‘జూన్2’ పుస్తకాల పరిచయ సభను తెలంగాణ రచయితల వేదిక -సాహితి సోపతి ఆధ్వర్యంలో ఆదివారం (ఫిబ్రవరి 8)న జరగబోతోంది. ఉదయం 11 గంటలకు కరీంనగర్ ఫిలింబవన్ లో జరిగే కార్యక్రమానికి జర్నలిస్టు మిత్రులందరూ హాజరుకావాలి.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లం నారాయణ, ఎడిటర్ కే.శ్రీనివాస్ గారు, ఘంటా చక్రపాణి, అన్నవరం దేవేందర్, జూకంటి జగన్నాథం, పత్తిపాక మోహన్, బూర్ల వెంకటేశ్వర్లు హాజరుకానున్నారు. సమన్వయ కర్తగా కందుకూరి అంజయ్య వ్యవహరిస్తున్నారు. ప్రముఖులు, సాహిత్యాభిమానులు, జర్నలిస్టులందరూ హాజరుకావాల్సిందిగా మనవి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *