
ప్రపంచకప్ క్రికెట్ తుది అంకానికి చేరింది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం ఫైనల్ జరుగనుంది. క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ క్రికెట్ సమరంలో చివరకు ఆతిథ్య దేశాలే ఫైనల్ కు చేరుకోవడం విశేషం.
గ్రూప్ దశలో ఈ రెండింటి మధ్య జరిగిన మ్యాచ్ లో కొద్దిలో ఆస్ట్రేలియా ఓడిపోయి న్యూజిలాండ్ కు విజయం దక్కింది. కానీ అది న్యూజిలాండ్ గడ్డపై.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఫైనల్ జరుగుతుండడంతో ఫైనల్ విజేత అయ్యే అవకాశాలు ఆస్ట్రేలియాకు ఎక్కువగా ఉన్నాయి. క్రికెట్ ప్రంపచకప్ ఫైనల్ ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది.